తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి తెలంగాణ స్కూల్ ఎడ్యూకేషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్స్ పరీక్షలు ఎత్తివేస్తిన్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు అంతర్గత పరీక్షలు(ఇంటర్నల్స్)కు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం(2024-25) నుంచే ఇంటర్నల్స్ కు మార్కులు కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు. ఇక నుంచి ఆరు సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయి.
వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే తాజా మార్పులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుమారు 5.50 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.ఇప్పుడు అంతర్గత పరీక్షలకు మార్కులుండవు. ఒక్కో సబ్జెక్టు పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. సైన్స్‌లో భౌతిక, జీవశాస్త్రాలున్నందున ఒక్కో దానికి 50 మార్కుల చొప్పున ఉంటాయి. విద్యార్థులకు 24 పేజీల జవాబుపత్రం ఇవ్వాలని నిర్ణయించింది.