బంగ్లాదేశ్‌లో జిహాదీ శక్తులు మాత్రమే కాదు, ఆ దేశ సైన్యం కూడా హిందువులను బతకనీయడం లేదు. ఇస్లామిక్ ఛాందసవాద మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో ఉన్న ఆ దేశపు సైన్యం హిందువులను వేధించడాన్ని నిత్యకృత్యంగా మార్చుకుంది. తాజాగా, ఒక ముస్లిం అనాధ యువతితో ప్రేమబంధంలో ఉన్న హిందూ యువకుణ్ణి అమానుషంగా చంపేసింది.
‘ఢాకాలోని కిషోర్‌గంజ్ ప్రాంతానికి చెందిన హృదయ్ రవిదాస్, ఒక ముస్లిం యువతిని ప్రేమిస్తుండేవాడు. ఆ విషయం తెలిసిన బంగ్లాదేశ్ సైన్యం అతన్ని కస్టడీలోకి తీసుకుంది. సైనికులు అతన్ని చిత్రహింసలు పెట్టారు. వాటిని తట్టుకోలేక హృదయ్ రవిదాస్ హృదయం స్పందించడం మానేసింది. ఆ యువకుడు నవంబర్ 15న చనిపోతే ఇప్పటివరకూ కనీసం కేసు రిజిస్టర్ అయినా చేయలేదు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలి’ అని మానవ హక్కుల నూర్ఖాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఆ అనాధ ముస్లిం యువతి కూడా, సైన్యం చేతిలో హత్యకు గురైన హృదయ్ రవిదాస్‌కు న్యాయం జరగాలి అని డిమాండ్ చేస్తోంది.
హృదయ్ రవిదాస్ శరీరం దొరికినప్పుడు దానిమీద గాయాల గుర్తులున్నాయి. ఆ శవాన్ని తల్లిదండ్రులు చూసారు, వైద్యులు పరిశీలించారు. అతను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడని వారు భావిస్తున్నారు. తమ కొడుకు మరణం మీద వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.