పెను విమాన ప్రమాదం తప్పింది. హౌతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతోన్న విమానంపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఫైలెట్ చాకచక్యంగా దారిమళ్లించడంతో ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే…
స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం అమెరికాలోని ఫ్లోరిడా నుంచి హౌతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌కు సోమవారం బయలుదేరింది. ఉదయం ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ రెండు గ్యాంగుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఉగ్రవాదులు విమానం సిబ్బందిపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది ఒకరు గాయపడ్డారు. విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని డొమినియన్ రిపబ్లికన్‌లో దింపారు. తరవాత పరిశీలించగా విమానంలో బుల్లెట్లు దొరికాయి.
విమానంలోని 110 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఫైలెట్ చాకచక్యంగా వ్యవహరించి దారిమళ్లించడంతో ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. క్యాబిన్‌లో మరో ఫైలెట్ గాయపడ్డారు.