సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ పదవీ విరమణ చేసే సమయం దగ్గర పడినప్పటినుంచీ ఉదారవాదుల ఉదరకోశాల్లో వ్యాధులు మొదలయ్యాయి. ఆయన పెద్ద మోసగాడంటూ సోషల్ మీడియాలో చొక్కాలు చించేసుకున్నారు. నిజానికి, కొద్దికాలం క్రితం వరకూ ఆయన వారి కథానాయకుడు. వాళ్ళు కోరుకున్నదల్లా చేసిపెట్టిన న్యాయకోవిదుడు. ఆయన ప్రసంగాలు వాళ్ళకు చెవుల్లో తేనె పోసినంత మధురంగా ఉండేవి. కానీ, పరిస్థితులు ఎలా మారిపోయాయో మరి. అందుకే కామోసు, ఆయన వల్ల కలిగిన నొప్పి వారికి భరించడం శక్యంగా లేదు. అసలు ఈ ఉదారవాదుల బాధేమిటో తెలవాలంటే మనం కొన్ని అడుగులు వెనక్కి వేయాలి. వారి ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుంది? దాన్ని నియంత్రించేవారు ఎవరు? వారి అజెండాలు ఏమిటి? అన్న సంగతులు తెలుసుకోవాలి.
ముందుగా మనం ‘లౌకికవాదాని’కి భారతదేశపు నిర్వచనం ఏమిటో తెలుసుకోవాలి. అది నిజమైన యూరోపియన్ ‘లౌకికవాదం’ నిర్వచనం కాదు. యూరోపియన్ లౌకికవాదం అంటే రాజ్య వ్యవస్థ నుంచి చర్చిని దూరంగా ఉంచడం, దానికోసం ఎంతదూరమైనా వెళ్ళడం. కానీ మనదేశంలో మన ఉదారవాదులు చెప్పే లౌకికవాదం నిర్వచనం అది కాదు. మనదేశంలో చూస్తున్న లౌకికవాదం నిర్వచనాన్ని కల్పించి, దాన్ని నియంత్రిస్తున్న వ్యవస్థను (ఎకోసిస్టమ్) అర్ధం చేసుకోవాలి. ఆ తర్వాత విస్తృతమైన గ్లోబల్ ఎకోసిస్టమ్‌ను, దాని పనితీరునూ అర్ధం చేసుకోవాలి. తమకు విధేయంగా ఉండి తమ అడుగులకు మడుగులొత్తి కొంచెం లాభాలతో సంతృప్తిపడే, లేక, తమను వ్యతిరేకించి మురికివాడలుగా మిగిలిపోయే మూడోప్రపంచపు దేశాల కూలీలను ఆకర్షించే అంతర్జాతీయ కణిక వ్యవస్థ అది. చివరిగా, సీజే చంద్రచూడ్‌ను, ఆయన పనితీరును, ఆయన బహిరంగ వ్యాఖ్యలనూ గమనించాలి. అప్పుడే ఉదారవాదుల ఆవేదన అర్ధమవుతుంది.
లౌకికవాదానికి భారతదేశపు ఉదారవాదులు ఇచ్చిన హిందూ వ్యతిరేక నిర్వచనానికి డివై చంద్రచూడ్ కట్టుబడలేదు. మన దేశంలో సెక్యులరిజం అంటే రాజ్యవ్యవస్థలో చర్చికి స్థానం లేకపోవడం కాదు. కనీసం, నెహ్రూ-ఇందిర-సోనియా హయాంలో అలా లేదు. మన దేశంలో లౌకికవాదం అంటే మెజారిటీ ప్రజలు విశ్వసించే మతపు ఆచారాలు, సంప్రదాయాల పట్ల గౌరవం నటించడం, తమ నిజమైన మతవిశ్వాసాలను రహస్యంగా ఉంచడం. ఐరోపాలోని లౌకికవాదులు ఇలాంటి పనులు చేయరు. మన రాజకీయ నాయకులు మాత్రం ఏదైనా కార్యక్రమంలో పూజల్లో పాల్గొంటారు, కానీ వారి నిజమైన లక్ష్యం వేరే ఉంటుంది.
భారతదేశంలో లౌకికవాదం అంటే సనాతన ధర్మం పట్ల గుడ్డిగా అనవసరమైన ద్వేషం కలిగి ఉండడం. ఆ లక్షణం పుట్టుకతోనే చురుగ్గా ఉండాలి. దాన్ని బాహాటంగా ప్రదర్శించగలగాలి. అలాంటి సనాతన ద్వేషాన్నే లౌకికవాదం పేరిట ప్రచారం చేసేది, దాన్ని నియంత్రించేది, క్రమబద్ధీకరించేదీ కరడుగట్టిన వామపక్షవాదులు. నిజానికి ప్రథమ ప్రధాని నెహ్రూ స్వయంగా తానే ఒక కమ్యూనిస్టు. తనే స్వయంగా సోవియట్ వ్యవస్థను, స్టాలిన్‌ను ఉదారంగా పొగడడం దానికి నిదర్శనం. ఆయన విధానాలు సోషలిస్టు రంగు పులుముకున్న కమ్యూనిస్టు విధానాలు.
హిందూధర్మంపై వామపక్షుల ద్వేషానికి కారణం లేకపోలేదు. క్రూరమైన-దుర్మార్గమైన-అత్యాచారాలకు పాల్పడే-అడ్డొచ్చినవారిని అడ్డంగా నరికేసే-దిగుమతి చేసుకున్న-వామపక్ష భావజాలపు స్టాలినిస్టులు, మావోయిస్టులు, తదితర వర్గాలు భారతదేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడుతున్న ఆఖరి ఆటంకం హిందూధర్మమే. వాళ్ళు బౌద్ధ, క్రైస్తవ, ఇస్లామిక్ దేశాల్లో సైతం విజయం సాధించగలిగారు, కానీ భారత్‌ను మాత్రం వారు గెలవలేక పోయారు. ఆ లోపాన్ని సరిచేయాలంటే హిందూధర్మం ఉండకూడదు. అందులో ఇంక ‘అయితే’, ‘కానీ’లకు స్థానం లేదు.
దురదృష్టం ఏంటంటే వామపక్షవాదులు, వారు మద్దతిచ్చే అవినీతికర ఫాసిస్టు దోపిడీదారు కుటుంబాలు ఈ ‘లౌకికవాదం’ అనే ఆలోచన గురించి చాలా స్పష్టత ఉంది. దేశపు వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతూ, ప్రజల పట్ల బాధ్యత లేని అధికారాన్ని అనుభవించడమే వారి నిజమైన లక్ష్యం. దానికి అనుకూలంగా లౌకికవాదాన్ని ఎలాపడితే అలా మలచుకుంటారు. గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుందన్నట్టు, మూర్ఖులైన హిందువులు వారినే నమ్ముతారు. లౌకికవాదం పేరిట వారు చేసే అబద్ధపు నాటకాలు అన్నింటినీ విశ్వసిస్తారు. వారి అన్ని చిన్నచిన్న చర్యలనూ, ఎన్నికల వేళ వారాడే టెంపుల్ రన్ ఆటలనూ, అప్పుడప్పుడూ నుదుటన పెట్టుకునే బొట్లనూ నమ్ముతుంటారు. ‘‘అబ్బే, అతను మనను ద్వేషించడమా! అసంభవం! చూడు, అతనెలా ప్రార్థనలు చేస్తున్నాడో!’’ అనుకొంటూ ఉంటారు. గుడిలోకి వచ్చినా అతను దైవం పట్ల కనీస గౌరవమైనా చూపించడు, ముఖం ముటముటలాడిస్తూ ఉంటాడు. ఐతే ఏంటి. వాళ్ళ నిర్లిప్తత సైతం హిందువుకు కాకతాళీయంగానే కనిపిస్తుంది. ఒక జడ్జి, ఆ మాటకొస్తే ఏ వ్యక్తి అయినా సరే నిజమైన లౌకికవాది అయితే ఈ లెఫ్టిస్టు ఎకోసిస్టమ్‌కు తృప్తి ఉండదు. మీరు గమనించండి. చంద్రచూడ్ ఒక హిందువు. ఆయన నాస్తికుడూ కాదు, అజ్ఞేయవాదీ కాదు. హిందువు. ఆయనకు ఆయుర్వేదం అంటే ఇష్టం. గణపతి పూజ చేస్తారు. అలా ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి ఆయన లౌకికవాది, ఇతర మతాలను గౌరవిస్తాడు. క్రిస్మస్ కెరోల్స్ పాడతారు. ప్రతీ హిందువూ ఎలాంటి లౌకికవాదిగా ఉండాలని వామపక్షులు అనుకుంటారో అలాంటి సెక్యులర్ హిందువుగానే ఆయన ఉంటున్నారు కదా అని మీరు అనుకుంటున్నారా? కనీసం, వారు బైటకు చెప్పేది అదే కదా. కాదు. మీరు ఇంకా నిజానికి చాలా దూరంలో ఉన్నారు.
తమ ఆదర్శాలను కేవలం చిలకపలుకుల్లా వల్లెవేసే వారంటే వామపక్షులకు ఆసక్తి లేదు. వారేమైనా హిందువులా ఏమిటి, అలా మూర్ఖంగా ఒప్పేసుకోడానికి, ఇతరుల నియంత్రణలో ఉండడానికి. వారు వామపక్షులు. స్టాలిన్, మావో, పోల్‌పాట్, కిమ్ లేదా భారతదేశంలోని వారి భావదాసులు ఎవరైనా కానీయండి… వాళ్ళకు పూర్తి విధేయంగా ఉండవలసిందే. సుప్రంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ప్రతీ హిందువూ ఆచరణలో నాస్తికుడై ఉండాలి. తనను తాను ద్వేషించుకునే వాడై ఉండాలి, హిందువులను, వారి విశ్వాసాలనూ నిర్మూలించే యుద్ధంలో ఇష్టపూర్వకంగా పాల్గొనే యోధుడై ఉండాలి. ఆ లక్షణాల్లో ఏదీ లేదా. మీరు పనికిరారు. వామపక్షులకు హీరోలైన ఔరంగజేబు వంటి సుల్తాన్లు చెప్పినట్లు, మారిపోండి లేదా చచ్చిపోండి.
ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తించదు. మెజారిటీ మతాన్ని ద్వేషించని క్రైస్తవులు, ముస్లిములకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంటే వారికి పడదు. ఆయన అచ్చమైన ముస్లిం. కానీ హిందువులను, హిందూధర్మాన్నీ ద్వేషించడు. కాబట్టి వామపక్షులు చెప్పే లౌకికవాదాన్ని ఆయన తీవ్రంగా ఉల్లంఘించినట్లే. కాబట్టి వారు ఆయనని పూర్తిస్థాయిలో ద్వేషించారు. ఇంక హిందూ ధర్మాన్ని గౌరవించే, లేక నిజాయితీగా లౌకికవాదిగా ఉండడానికి ప్రయత్నించే తారక్ ఫతే లాంటి మామూలు మనుషుల సంగతి చెప్పనే అక్కర లేదు.
నిజానికి చంద్రచూడ్, ‘న్యాయ స్వాతంత్ర్యం’ – జ్యుడీషియల్ ఇండిపెండెన్స్ అనే వామపక్ష ఆలోచన తనకు అర్ధమైందని ఈమధ్యనే స్పష్టం చేసారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి కూడా ఆయన వామపక్షం అన్న పదం వాడలేకపోయాడు. కొన్ని ‘ప్రెషర్ గ్రూప్స్’ తమకు పూర్తి విధేయంగా ఉండాలని ఆశిస్తాయనీ, అలా చేయకపోతే మీరు స్వతంత్రంగా వ్యవహరించలేరనీ ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ చంద్రచూడ్ చెబుతున్నది ఎవరి గురించి అన్న విషయం అర్ధం కానివారు మానసికంగా ఎదగని పిల్లల్లాంటివారే. ఆయన ఆలోచనలు అద్భుతమైన స్పష్టతతో ఉన్నాయి. ప్రతీ భారతీయుడూ ఆయన ఏం చెప్పాడో అర్ధం చేసుకోవాలి, ఆ ప్రకారం ప్రవర్తించాలి. ఆ స్థాయి అసహనం, ఎదుటివారు పూర్తిస్థాయిలో తమకు లొంగిపోవాలని ఆశించడం వారి భావజాలపు ప్రధాన లక్షణం. ఆ భావజాలమే క్రూరమైన అత్యాచారాలు, సామూహిక హత్యలు, మానవత్వంపై నేరాలకు దారితీస్తుంది. అది స్టాలిన్, మావో వంటి వారి డెమీ-గాడ్స్ పాలన అయినా సరే మారదు.
చంద్రచూడ్ ఆలోచనల్లో ఆ స్పష్టత, ఆయన చూపులో న్యాయ స్వాతంత్ర్యానికి అర్ధం మొదటినుంచీ ఉన్నాయి. ఎవరూ దుస్తులు మార్చుకున్నంత వేగంగా ఆదర్శాలను మార్చుకోలేరు. కానీ మరెందుకో పాపం, ఈ వామపక్షులు తమకు అనుకూలంగా ఉన్నదాన్ని మాత్రమే వినడానికి అలవాటు పడిపోయారు. మెజారిటీల పద్ధతికి వ్యతిరేకంగా తన లౌకికవాదపు భావనల్లో నుంచి వచ్చే మాటలను మాత్రమే వారు వింటూ వచ్చారు. లౌకికవాదం స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ వామపక్షులకు అది సరిపోదు. సనాతన ధర్మం పట్ల పూర్తి ద్వేషం వెళ్ళగక్కాలి. అంతకు తక్కువగా ఏదీ వద్దు.
తమ భ్రాంతి వల్ల తామే మూర్ఖులైపోయిన ఆ స్టాలినిస్టు ముఠా ఒక్కసారిగా నిద్రలేచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తమ చేతి తోలుబొమ్మ కాదని గ్రటమించింది. అప్పటినుంచీ ఆయనమీద విద్వేషపూరితమైన హింసాత్మకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకుముందరి డిబేట్‌లో బైడెన్ మతిమరుపు బైటపడ్డాక దాన్ని కాదనలేని, దాచిపెట్టలేని, దానిగురించి అబద్ధమాడలేని పరిస్థితి నెలకొన్నట్టే సెక్యులరిజం, స్వతంత్రం వంటి అంశాల గురించి చంద్రచూడ్ ఆలోచనలు సామాన్య ప్రజలందరికీ సాధారణంగానే తెలియడం వామపక్షీయులకు జీర్ణం కాలేదు.
చంద్రచూడ్ ఇటీవలి మాటలు, పనులు ఈ సోకాల్డ్ ఉదారవాదులకు ఉదరవ్యాధి తెప్పించాయి. గణపతి పూజ చేయడం, అయోధ్యను దర్శించుకోవడం, తీర్పు ముందు భగవంతుణ్ణి ప్రార్థించడం… ఇవన్నీ చూసాక ఆ వ్యక్తి లౌకికవాది కాదని తేలిపోయింది. కనీసం స్టాలినిస్టు నిర్వచనం పరిధిలో. ఇప్పుడు ఆయన ఎన్ని క్రిస్మస్ కెరోల్ గీతాలు పాడినా ఇంక ఆయన ఇమేజ్ మారదు. ఎందుకంటే నిజానికి వారికి కావలసింది సీజే లాంటి వ్యక్తి హుందాగానో, నిజమైన ఉదారవాదిగానో ఉండడం కాదు. ఆ వ్యక్తి ద్వేషంలో జీవించాలి. హిందువులను, హిందూ ధర్మాన్నీ ద్వేషించాలి. ఆ పని చేయకపోతే ఆయన ఉదారవాది ఎలా అవుతాడు? ఒకసారి ఆయన రిటైర్మెంట్ లాంఛనం పూర్తయాక ఆయన మీద జరిగే దుష్ప్రచారం, దుర్భాషలు తీవ్రస్థాయిలో ఉంటాయి. తాము చెప్పిన దాన్ని దాటి సొంతంగా ఆలోచించే సాహసం చేస్తే ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి కదా. ఇంక ఆయనని చూసి కుక్కల మొరుగుళ్ళు పెరుగుతాయి.
సనాతన ధర్మం అంటే వామపక్షుల ద్వేషం ఇటీవలిది కాదు. అది వారి సైద్ధాంతిక విద్వేషం, డబ్బు దాన్ని కొనలేదు. ఈ వామపక్ష మేధావులు వోద్కా సీసాల కోసం, మాస్కో ఉచిత పర్యటనల కోసం రష్యా ఎంబసీ గేట్ల దగ్గర పడిగాపులు కాసేవారన్న సంగతి ఇక్కడ అప్రస్తుతం అనుకోండి, ఎందుకంటే అది వారికి కార్మికుల మీదుండే ప్రేమ అనుకోవాలి. అయితే ఈ సమీకరణంలోకి అంతర్జాతీయ వోక్ ఎకోసిస్టమ్, కతార్ లాంటి ఇస్లామిక్ దేశాల చమురు డబ్బులూ ఓ కొత్త అంశాన్ని లాక్కొచ్చాయి, అదే డాలర్. ఈరోజుల్లో హిందూ ద్వేషాన్ని ప్రకటించడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంటే చాలు… బోలెడన్ని నిధులు, ఉపకారవేతనాలు, ఉద్యోగాలు, రకరకాల లబ్ధులూ వచ్చిపడతాయి. అవి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయంటే నిష్ఠగా హిందూమతాన్ని అనుసరించేవాళ్ళు సైతం ప్రలోభపడి తమ ధర్మాన్ని వదిలేసుకోడానికి సిద్ధపడేలా ఉంటాయి. మీరొక అగ్రవర్ణానికో లేక ఉన్నతవర్గానికో చెంది మంచి జీవితానికి అలవాటు పడుంటే, కానీ మీ చేతిలో జెఎన్‌యు, అశోకా వంటి విశ్వవిద్యాలయాలు ఇచ్చిన సోషియాలజీ లేదా పొలిటికల్ సైన్స్ డిగ్రీ మాత్రమే ఉంటే…. సమాజానికి పనికొచ్చే ఎలాంటి ఉత్పాదక రంగంలోనూ మీకు ఉద్యోగం రాదు. అప్పుడే అల్‌జజీరా బూట్లో లేక జార్జిసోరోస్ రంధ్రాలో బంగారు గనుల్లా కనిపిస్తాయి.
హిందూధర్మాన్ని అనుసరించేవారు రోజూ ఎదుర్కొనే లెఫ్టిస్టు ఎకోసిస్టమ్ ఇది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తన విశ్రాంత జీవితంలో ప్రతీరోజూ ఎదుర్కొనబోయే వామపక్షుల అవ్యవస్థ ఇది.