తొలిరోజు గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు సమావేశాల నిర్వహించాలని పాలక పక్షం భావిస్తోంది. సమావేశాల్లో భాగంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుండగా, ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్తో పాటు ఇతర బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నారు.