రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్, విద్యాభారతి ఉత్తరప్రాంత శిక్షణా కార్యక్రమాల నిర్వాహకులు హర్షకుమార్ తుదిశ్వాస విడిచారు.
హర్షకుమార్‌ను అక్టోబర్ 31న జలంధర్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. ఆయన నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం సుమారు 6.20 గంటలకు కన్నుమూసారు. ఢిల్లీకి చెందిన హర్షకుమార్ విద్యాభారతిలో వివిధ హోదాల్లో పనిచేసారు, ఆ సంస్థకు గణనీయమైన సేవలు అందించారు. విద్యాభారతి పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడంలో, శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో ఆయన ప్రధాన భూమిక వహించేవారు. తర్వాత ఆయన హర్యానా ప్రాంత విద్యాభారతి సంఘటనా మంత్రిగా పనిచేసారు.
హర్షకుమార్ కొద్దిరోజుల క్రితం హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన క్షేత్రీయ బైఠక్‌లో పాల్గొన్నారు. అక్కడినుంచి నిన్ననే జలంధర్ చేరుకున్నారు. అనారోగ్యం కారణంగా అక్టోబర్ 31న ఆస్పత్రిలో చేరారు. ఆయన అంత్యక్రియలు ఈ ఉదయం 10 గంటలకు జలంధర్‌లోని శివపురి సూర్య ఎన్‌క్లేవ్‌లో జరిగాయి.