ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ భారీ టక్కుతో విరుచుకుపడ్డారు. మొస్సాద్ కార్యాలయం సమీపంలో ఓ ఉగ్రవాది భారీ ట్రక్కుతో దూసుకెళ్లాడు. దీంతో ఆరుగురు చనిపోయారు. వెంటనే సైన్యం అతన్ని కాల్చి చంపింది. మొస్సాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఈ చర్యకు దిగినట్లు ఐడీఎఫ్ అనుమానిస్తోంది.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. గడచిన వారంలోనే 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ప్రతి రోజూ గాజాలో 30 నుంచి 50 మంది ఉగ్రవాదులను ఏరివేస్తున్నట్లు ఐడీఎఫ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆదివారం ఓ పాఠశాల సమీపంలో జరిపిన దాడుల్లో 8 మంది చనిపోయారు.
దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా సైన్యం డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. 50 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా, లెబనాన్‌లో ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. దాడులు ఆపితేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ హమాస్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.
గత ఏడాది అక్టోబరు 27న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 1400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రమూకలను ఏరివేసేంత వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తేల్చి స్పష్టం చేశారు.