ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం విషమించిందంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాలు వైరల్‌గా మారాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత నేపథ్యంలో ఖమేనీ ఆరోగ్యంపై కథనాలు సంచలనంగా మారాయి. ఆయన తరవాత వారసుడు ఎవరనే దానిపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి తరవాత జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న ఖమేనీ ఆరోగ్యంపై న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించింది.అయితే దీనిపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.
1989లో రుహొల్లా ఖమేనీ మృతి తరవాత అయతొల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వారసుడిగా భావించిన ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఖమేనీ తరవాత వారసుడు ఎవరనే దానిపై పలు చర్చలు జరుగుతున్నాయి.ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబాకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు కాబొతున్నారనే అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు గత ఏడాది అక్టోబరు 27న ఇజ్రాయెల్‌పై విరుచుకుపడి 14 వందల మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన యుద్ధం తాజాగా ఇరాన్‌కు పాకింది. తీవ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడం, ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేయడంతో అది మరింత ముదిరింది. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్‌లోని ఆయుధాగారాలు లక్ష్యంగా భీకరదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరనేది అత్యంత కీలకంగా మారింది.