అతిసార బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. డయేరియా బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మృతుల కుటుంబీకులను, బాధితులను మాజీ సీఎం పరామర్శించారు. డయేరియా కారణంగా 14 మంది చనిపోయాని కనీసం ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించడానికి రాకపోవడం శోచనీయమన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో గడచిన రెండు వారాల్లో అతిసారతో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. విజయనగరం, చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు కారణంగా డయేరియా ప్రబలినట్లు ప్రభుత్వం గుర్తించింది. సమీపంలోని నదినీటిని గుర్ల గ్రామానికి సరఫరా చేస్తున్నారు. చంపావతి నది నీరు కలుషితం కావడంతో పదుల సంఖ్యలో గ్రామస్థులు అతిసార భారినపడ్డారని వైద్యాధికారులు తెలిపారు.