మనుషులపై దాడి చేసి ప్రాణాలు హరించిన చిరుతను అటవీ అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. గడచిన నాలుగు వారాల్లో 8 మందిని బలితీసుకున్న చిరుతను ఎట్టకేలకు అధికారులు కాల్చి చంపారు. గత వారం ఓ దేవాలయం వద్ద నిద్రిస్తోన్న పూజారిపై దాడి చేసి చంపిన చిరుత, గురువారం నాడు ఇద్దరు మహిళలపై దాడి చేసి చంపేసింది. ఇలా గత నెల 18 నుంచి ఎనిమిది మందిని బలితీసుకుంది.
సీసీ కెమెరాల ఆధారంగా చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దాని కోసం నెల రోజులుగా పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. చిరుత భయంతో ఉదయ్‌పూర్ వాసులు చీకటి పడితే భయటకు రావడం లేదు. ఒక వేళ బయటకు వస్తే గుంపులుగా రావాలని అటవీ అధికారులు హెచ్చరించారు. అయితే ప్రస్తుతం అటవీ అధికారులు కాల్చిచంపిన పులి నమూనాలకు ల్యాబుకు పంపించారు. ఫలితాలు వచ్చిన తరవాత మనుషులను చంపేసిన చిరుతా కాదా అనేది శాస్త్రీయంగా తేలనుంది.