ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు : ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన అంతర్జాతీయ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో, న్యూఢిల్లీలో అత్యవసరంగా దింపారు. బ్యాంకు నిర్వీర్య దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు గంటలు ఆలస్యంగా ఎయిరిండియా విమానం న్యూయార్క్ బయలుదేరి వెళ్లింది.
ఇటీవల కాలంలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువై పోయాయి. గత ఆరు మాసాల కాలంలో ఇలాంటివి 5 వరకు వచ్చాయి. అయితే ఎలాంటి బెదిరింపు సమాచారం వచ్చినా విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల కొద్దీ ఆలస్యం కావడంతో అంతర్జాతీయ ప్రయాణీకులు గంటల కొద్దీ విమానాశ్రయాల్లో పడిగాపులు పడాల్సి వస్తోంది.