ఉత్తరాది రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలకు దారితీసేలా దుండగులు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో కుట్రకోణం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో లలాండౌర్ ధందేరా స్టేషన్ల మధ్య దుండగులు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉంచారు. లోకో ఫైలెట్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్నారు. అది ఖాళీ సిలిండర్ అని పోలీసులు గుర్తించారు.
ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు జరిగేలా కొందరు దుండగలు పట్టాలపై భారీ రాళ్ళు, ఇనుక రాడ్డులు, గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు ఉంచుతోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కాన్పూరు సమీపంలో పట్టాలపై భారీ ఇనుప స్థంభాన్ని ఉంచిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు. ఇక రైలు పట్టాలపై పేలుడు పదార్థాలు ఉంచి, సైనికులు ప్రయాణిస్తోన్న రైలుకు ప్రమాదం కలిగేలా చేసిన ఘటనలోనూ ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వరుస ఘటనల నేపథ్యంలో రైలు పట్టాలపై ఆర్పీఎఫ్ నిఘా పెంచింది.