టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఇప్పటికే ఈ రెండు కేసులను మంగళగిరి పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టయ్యారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే 76 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ప్రధానంగా పెడన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పలు మార్లు మంగళగిరి పోలీసులు జోగి రమేష్‌ను విచారించారు. విచారణకు జోగి రమేష్ సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు కేసులు సీఐడికి అప్పగించి విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.