ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పాలస్తీనాలోని నూర్ షమా శరణార్థి శిబిరంలో తాజాగా జరిపిన దాడుల్లో తుల్కరీమ్ ప్రాంత పీఐజే కమాండర్ మహమ్మద్ అబ్దుల్లా హతమైనట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. గతంలో దీనికి జుబేర్ కమాండర్‌గా ఉన్నారు. అతన్ని చంపేసిన తరవాత అబ్దుల్లా ఆ బాధ్యతలు చేపట్టారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడుల్లో అబ్దుల్లా కీలకంగా పనిచేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. సైన్యాన్ని చంపేందుకు అబ్దుల్లా పలుచోట్ల పేలుడు పదార్థాలు పెట్టినట్లు వెల్లడించారు. అబ్దుల్లాకు చెందిన సెమీ ఆటోమేటెడ్ ఆయుధాన్ని కూడా ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయడానికి సిద్దమవుతోందనే వార్తలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతకు దారితీసింది. సరిహద్దులు మూసివేయాలని పొరుగు దేశాలు కోరుతున్నాయి. ఇరాన్‌పై దాడికి తమ గగన తలాన్ని వాడుకోనీయమని పలు సరిహద్దు దేశాలు హెచ్చరించాయి.