పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రతన్ టాటాకు పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ప్రధాని మోదీ లావోవ్ పర్యటనలో ఉండటంతో ఆయన హాజరు కాలేకపోయారు. వేలాది మంది అభిమానులు, టాటా ఉద్యోగులు, ప్రముఖ నాయకులు రతన్ టాటాకు చివరి వీడ్కోలు పలికారు.
రతన్ టాటా అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ముంబైలోని ఆయన నివాసం నుంచి వర్లిలోని శ్మశానవాటిక వరకు చివరి యాత్ర సాగింది. పలువురు ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో చివరి వరకు పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, అభిమానులు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. దేశం ఒక దార్శనికుడిని కోల్పోయిందని హోం మంత్రి అమిత్ షా ఆవేదన చెందారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ రతన్ టాటా అంత్యక్రియలకు హాజరయ్యారు.