తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరించిపోయారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. చైతన్యప్రదాత. సూర్యచంద్రుల వల్లే ప్రకృతి కొనసాగుతోంది. సూర్యప్రభపై ఊరేగే శ్రీవారిని దర్శించుకోవడం వల్ల సకల రోగ నివారణతోపాటు, విద్య, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
ఇవాళ సాయంత్రం మలయప్ప స్వామి వారు చంద్రప్రభ వాహనంపై వివరించనున్నారు. చంద్రుడు స్వయంగా శివునికి శిరోభూషణమై శ్రీవారికి వాహనంగా ఉండటం ఇక్కడి విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసించడం గొప్ప అనుభూతి. చంద్రవాహనంపై స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు తిరుమల చేరుకుంటున్నారు.