ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ కు పయనం అవుతున్నారు.
అక్టోబర్ 10, 11 తేదీల్లో ప్రధాని మోదీ లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. 21వ ఆసియాన్ – ఇండియన్ సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆసియాన్ – ఇండియాకు లాహోస్ అధ్యక్షత వహిస్తోంది.
యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇండో – పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఈ విధానాన్ని అనుసరించి ఏడాది కాలం అవుతుందని గుర్తు చేసింది.
రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఇటలీలో ప్రధాని మోదీ పర్యటించారు. తాజాగా లావోస్ పర్యటనకు వెళుతున్నారు.