పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా బీరుట్‌పై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయ కమాండర్ సోహిల్ హొసైన్ హోసైనీ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఐడీఎఫ్ స్వయంగా ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులు చేసి సంవత్సరం అయింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది.
హమాస్, హెజ్‌బొల్లా ఉగ్రవాదుల స్థావరాలు, కీలక నేతలు లక్ష్యంగా దాడులు చేస్తోన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఓ మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 26 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే ఉగ్రవాదులే లక్ష్యంగా దాడి చేసినట్లు ఐడిఎఫ్ స్పష్టం చేసింది.