తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘ బకాసుర వధ’ అలంకారంలో దర్శనమిచ్చారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను భావిస్తారు. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శిస్తే మంచిది. ఈ విధంగా స్వామిని స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనంతో తాపత్రయాలను తొలికి భక్తుల జీవితాలకు చల్లదనం దొరుకుతుంది.