స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ఉద్యోగాల జాతరకు తెరలేపనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 10 వేల మందిని కొత్తగా నియమించుకోనుంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంతోపాటు సాంకేతికంగా మరింత బలోపేతం అయ్యే చర్యల్లో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో కొత్తగా 600 శాఖలను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకు సుమారు 10 వేల మంది ఉద్యోగులు అవసరం అవుతారని చెప్పారు.
డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్టులు, నెట్వర్క్ ఆపరేటర్లు, వంటి ప్రత్యేక విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. మార్చి 2024 నాటికి సంస్థలో ఎస్బీఐ గ్రూపులో 2,32,296 మంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 22,542 శాఖలు ఉండగా , కొత్తగా 600 శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.