బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ లో జరిగిన రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్నిభారత్, మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం అందుకుంది.
ఓపెనర్ జైస్వాల్ మరోసారి ఆకట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు తగిన స్ట్రోక్స్‌తో ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలు చెరి మూడేసి వికెట్లు తీశారు. జడేజా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి భారత్ విజయం లో కీలకంగా నిలిచాడు. అయిదో రోజు 26 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 146 పరుగులు మాత్రమే చేయగల్గింది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ గా ప్రకటించింది.
దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంతో స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ను భారత్ గెలిచింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.