ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి బహుళజాతి సంస్థలకు చెందిన బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉండనుంది. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన సీఎం చంద్రబాబు, బహుళ జాతి కంపెనీల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
మందుబాబుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉన్న మెక్ డోవెల్ విస్కీ 1, ఇంపీరియలర్ బ్లూ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి దొరకనున్నాయి. ఇంపీరియల్ బ్లూ బ్రాండు మధ్యం 60 వేల కేసులు ఇప్పటికే దుకాణాలకు చేరుకుంది. మెక్ డోవెల్ 1 బ్రాండు 10,000 కేసుల క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరో పది రోజుల్లో లక్ష కేసులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లోకిరానున్నాయి. ఈ విషయాన్ని ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
యాంటిక్విటీ, రాయల్ చాలెంజ్, వాట్ 69, బ్లాక్ డాగ్, ఓడ్కా, జానీ వాకర్ రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ రకాలు కూడా సిద్ధంగా ఉంచనున్నారు.