భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో ) పంపిన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రయాన్-4 మిషన్, గగన్‌యాన్, శుక్రయాన్ , ఎన్జీఎల్ఏ వాహకనౌక ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు నిధులు కూడా కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
రెండు దశల్లో చంద్రయాన్-4 మిషన్‌ను నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది. ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా రోవర్ జపాన్‌లో సిద్ధం అవుతోంది. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడిపై మట్టి నమూనాలను సేకరించి భూమికి చేరుకుంటుంది. ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను రూపొందించిన దేశంగా భారత్ ఘనత సాధించనుంది.
గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను నింగిలోకి పంపేందుకు ప్లాన్ చేస్తుంది. పలువురు వ్యోమగాములను సైతం ఎంపిక చేసి శిక్షణ ఇస్తోంది.