ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచనపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇటీవలే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రను వరదలు ముంచెత్తాయి. దీంతో వాన అంటేనే ఆంధ్రప్రదేశ్ వాసులు బయపడుతున్నారు.
ఏపీలో మూడు రోజుల పాటు వానలు పడతాయని, పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో తేలకపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.