మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 2019లో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కోసం 67 నెంబరు జీవోను విడుదల చేసింది. తాజాగా 67 నెంబరు జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక నుంచి ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు అన్ని పాత విధానంలోనే టెండరింగ్ పిలవాల్సి ఉంటుంది. టెండర్ విధానంలో వైసీపీ తీసుకు వచ్చిన రివర్స్ పద్దతి వల్ల కాలయాపన జరుగుతోందని సీఎస్ గుర్తుచేశారు.