కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పును ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. పోర్ట్ బ్లెయిర్ ను శ్రీ విజయపురంగా మార్చడం తనకు సంతోషం కలిగించిందని పవన్ ట్వీట్ చేశారు.
వందల ఏళ్ళ పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, వలసవాద పాలనకు గా గుర్తుగా ఉన్న పేరును తీసేయడం అభినందనీయమన్నారు. భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీ విజయపురం పేరు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమని కొనియాడారు. ఈ నిర్ణయంతో భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును ‘శ్రీ విజయపురంగా మారుస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతంత్ర పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం’’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. చోళ సామ్రాజ్యంలో నౌకదళ స్థావరంగా ఉన్నఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడే ఎగరవేశారని, వీర్ సావర్కర్ సహా అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులను బంధించిన సెల్యూలర్ జైలు కూడా ఇక్కడే ఉందని అమిత్ షా , ట్వీట్ లో గుర్తు చేశారు.