అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ చేపట్టిన స్పేస్ వాక్ ప్రాజెక్టు పోలారిస్ డాన్ విజయవంతమైంది. అమెరికాలోని ప్లోరిడా సముద్రతీరం వద్ద స్పేస్ క్యాప్సుల్ విజయవంతంగా నేలకు దిగింది. ప్రపంచ కుబేరుడు జేర్డ్ ఇస్సాక్మన్ ఫైలెట్లు స్కాబ్ కిడ్పోటీట్, అన్నా మెనోస్, సారా గిల్లీస్ సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
బిలియనీర్ ఎలాన్ మస్క్ నడుపుతోన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఈ విజయం ద్వారా చరిత్రలో నిలిచింది. ఓ ప్రైవేటు సంస్థ విజయవంతంగా స్పేస్ వాక్ నిర్వహించడం ఇదే తొలిసారి. స్పేస్ ఎక్స్ సంస్థ గత మంగళవారం పాల్కన్ 9 ద్వారా నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. వ్యోమగాములు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. కొత్తగా తయారు చేసిన స్పేస్ సూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఆదివారం సురక్షితంగా భూమి మీదకు దిగింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు