అక్రమాలకు పాల్పడిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ను పంజాబ్ పోలీసు శాఖకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ శిషాన్ మిట్టల్‌ను నార్కోటక్స్ పోలీసులు మొహాలీలో అరెస్టు చేశారు. డ్రగ్ స్మగ్లర్లతో కలిసి అతను దందాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
ఫార్మసీ, మెడికల్ షాపులకు అతను అక్రమంగా డ్రగ్స్ అమ్మడంతో పాటు అక్రమ ఆదాయాన్ని మనీల్యాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జైలులో ఉన్న డ్రగ్ స్మగ్లర్లతో నిందితుడు చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడింది. అతడికి సంబంధించిన 24 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి వాటి నుంచి 7.09 కోట్లు సీజ్ చేశారు.
దర్యాప్తులో భాగంగా 1.49 కోట్ల నగదు, 260 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిరాక్‌పుర్, దాబ్వాలీలో ఉన్న రెండున్నర కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వెంచర్ ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు.