హమాస్ ఉగ్రవాదుల కమాండ్ కంట్రోల్ కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారంనాడు భీకరదాడులు జరిపింది. గాజాలోని అల్ మవాసీ ప్రాంతంపై జరిగిన దాడిలో 40 మంది చనిపోయారు. 60 మందికిపైగా గాయపడినట్లు పాలస్తీనా ప్రకటించింది. సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన అల్ మవాసీ ప్రాంతంపై దాడులు జరపడంపై పాలస్తీనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే హమాస్ ఉగ్రవాదుల కమాండ్ కంట్రోల్ కేంద్రం లక్ష్యంగానే దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
హమాస్ కీలక ఉగ్రవాదిని ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తరవాత పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఖతర్, ఈజిప్ట్ చేస్తోన్న శాంతి ప్రయత్నాలు నిలిచిపోయాయి. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై పాశవికదాడి తరవాత మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టే వరకూ యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పలుమార్లు ప్రకటించారు.
హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేసేందుకు రక్షిత ప్రాంతాన్ని 50 చదరపు కిలోమీటర్ల నుంచి 41 కిలోమీటర్లకు కుదించారు. అల్ మసి ప్రాంతంలో చదరపు కిలోమీటరు పరిధిలోనే 31 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.