జనావాసాల్లో చిరత సంచారం కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారి పక్కనే ఉన్న దూరదర్శన్ కేంద్రం వెనుక వైపు చిరుత కదలికలు గుర్తించారు. చిరుత వీడియో దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది. అటవీ శాఖ అధికారులు కూడా చిరుత సంచారాన్ని ధృవీకరించారు. రాజమహేంద్రవరం శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
రాజమహేంద్రవరంలో చిరుత సంచారంతో శివారు కాలనీల ప్రజలు వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో చిరుత సంచరిస్తోంది. దీంతో చీకటి పడితే బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. చిరుత ఎటు వెళ్లిందనే దానిపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.