ప్రకాశం బ్యారేజీని ఒకేసారి నాలుగు పడవలు ఢీ కొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. బ్యారేజీ గేట్లపై ఉండే కౌంటర్ వెయిట్ ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఈ నెల ఒకటో తేదీ వరద మొదలు కాగానే ఒకేసారి మూడు అతి భారీ పడవలు, మరో ఫంటు ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టాయి. ఈ ఘటనలో బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. బ్యారేజీకి 11.45 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పడవలు గేట్లకు అడ్డంపడ్డాయి. వరద తగ్గడంతో పడవలు తొలగించి, గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు.
నాలుగు పడవలు ఒకేసారి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన ఘటనపై నీటిపారుదల శాఖ అధికారులు విజయవాడ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి అన్ని పడవలు వరదలో వచ్చి బ్యారేజీని ఢీ కొట్టడంపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుట్ర కోణం వెలికితీయాలని కోరారు.