వరదలతో విజయవాడ డివిజన్లో రద్దు అయిన రైలు సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. కొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మచిలీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలు నడుస్తుండగా, . అహ్మదాబాద్–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్–కాట్రా (16031), త్రివేండ్రం–హజరత్ నిజాముదీన్ (12643) సర్వీసులు యథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి.
సికింద్రాబాద్–గుంటూరు (17202) రైలు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలును వయా తెనాలి మీదుగా మళ్ళించారు. న్యూఢిల్లీ–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12622) ,సికింద్రాబాద్–గుంటూరు (17202) సర్వీసులు దారి మళ్లించారు.