పాకిస్తాన్ తో చర్చలు జరిపే అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జైశంర్, పాకిస్తాన్ తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసిందని తేల్చి చెప్పారు.
పాకిస్తాన్ మనతో ఎలా వ్యవహరిస్తే మనం కూడా దేశంతో అలాగే స్పందిస్తామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ పాల్పడే ఉగ్రవాద చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయన్న జైశంకర్, జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 ముగిసిన కథ అన్నారు.
జర్మనీలో భారత్ కు చెందిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. కుమార్తెను భౌతికంగా హింసించారనే ఆరోపణలతో జర్మనీ ప్రభుత్వం సంరక్షణ కేంద్రానికి చిన్నారిని తరలించింది. దాదాపు 36 నెలలుగా చిన్నారి అక్కడే ఉంటోంది. ఈ విషయాన్ని ఆ తల్లిదండ్రులు స్థానిక ఎంపీ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లగా, ఆయన కేంద్రమంత్రికి తెలిపారు. చిన్నారిని సాధ్యమైనంత త్వరగా భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని జైశంకర్ తెలిపారు.