కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు నమోదు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. తాజాగా శ్రీశైలం డ్యాంకు (srisailam dam) 2 లక్షల 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 9 గేట్లు ఎత్తి లక్షా 70 వేలు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాకు 36 వేల క్యూసెక్కులు, తెలంగాణలోని భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలంలో 215 టీఎంసీలు నిల్వ చేశారు.
నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. సాగర్‌లో 312 టీఎంసీల వరద నీటిని నిల్వ చేశారు. ఎగువ నుంచి 2 లక్షల 30 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40 వేలు, గేట్లు ఎత్తడం ద్వారా 2 లక్షల క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేస్తున్నారు. పులిచింతల పూర్తిగా నిండిపోవడంతో 2 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు