భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.లాసానే డైమండ్ లీగ్‌లో రెండో స్థానం సాధించాడు. ఈవెంట్లో ఆరో ప్రయత్నంలో నీరజ్ తన జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్లో నీరజ్‌కు ఇదే బెస్ట్ త్రో.
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ 89.45 మీటర్ల దూరం విసిరగా 2022లో స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 89.94 మీటర్ల దూరం విసిరాడు. మొదటి అయిదు ప్రయత్నాల్లో భాగంగా 82.10మీ, 83.21మీ, 83.13మీ, 82.34మీ, 85.58మీ దూరం విసిరాడు.
గ్రెనిడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 87.08 మీటర్ల దూరం విసిరి మూడో స్థానం లో నిలిచాడు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు రాణా అయ్యూబ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు