భారత ప్రభుత్వం తొలిసారి అత్యున్నత సైన్స్ పురస్కారాన్నిఅందజేసింది. ప్రఖ్యాత బయోకెమిస్ట్, బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్‌ను విజ్ఞాన రత్న అవార్డుతో గౌరవించింది.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, నవ్యావిష్కరణలకు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కొత్తగా ఈ పురస్కారం అందజేస్తోంది.
నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా గణతంత్ర మండపంలో పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అందజేశారు. 13 విజ్ఞాన్ శ్రీ పురస్కార్, 18 విజ్ఞాన్ యువ -శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌లు, ఒక విజ్ఞాన్ టీమ్ అవార్డును కూడా రాష్ట్రపతి అందజేశారు. చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కింది.