అప్ఘనిస్తాన్ ప్రభుత్వం వింత నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రభుత్వం లో పనిచేసే ఉద్యోగులు గడ్డం పెంచలేదంటూ 281 మందిని విధులు నుంచి తొలగించింది.
ఇస్లామిక్ చట్టాల ప్రకారం తమ ప్రభుత్వంలో పనిచేసే ప్రతీ ఒక్కరు గడ్డం పెంచాల్సిందేనని తాలిబన్లు పేర్కొన్నారు. గడ్డం పెంచని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తాలిబన్ సర్కార్ హెచ్చరించింది.
గతేడాది కాలంగా దేశంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన 13వేల మందిని అదుపులోకి తీసుకున్నట్లు సర్కార్ వెల్లడించింది.
అఫ్ఘనిస్తాన్లో 2021లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా మంత్రిత్వ శాఖను రద్దు చేసి నైతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దీంతో మహిళల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
హిజాబ్ ధరించని మహిళలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ శాఖ తీరుపై మానవ హక్కుల సంస్థలు, యూఎన్ఓ బహిరంగం విమర్శలు చేస్తున్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు