అమెరికాలో శ్రీ ఆంజనేయస్వామి వారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.స్టాచ్యూ ఆఫ్ యూనియన్(SOU) పేరిట 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పరిధిలోని అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ఈ ఘట్టం ఆవిష్కృతమైంది.
భారత సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ చిన్నజీయర్ స్వామి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద మొత్తంలో హిందువులు ఈ ఘట్టంలో భాగస్వాములయ్యారు.
జై వీర హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం పరమపవిత్రంగా మార్మోగిపోయింది. విగ్రహంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ మొబైల్స్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.