స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేసేందుకు తిరంగా యాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందరేశ్వరి తెలిపారు. విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ దేశమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
బిజెవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో తిరంగా యాత్రను ఆమె ప్రారంభించారు. విజయవాడ అప్సర థియేటర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం సెంటర్ వరకు యాత్ర సాగింది. పార్టీలకు అతీతంగా దేశ మంతా జాతీయ జెండాను ప్రతీ నివాసంపై ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తిరంగా యాత్ర గురించి వివరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా ,తిరంగా యాత్ర ఇంఛార్జి ముని సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.