బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. ప్రధాని అధికారిక నివాసంలో వస్తువుల్ని లూటీ చేయడంతో పాటు ప్రముఖుల నివాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. అల్లర్లలో బంగ్లా ప్రముఖ హీరోతో పాటు అతడి తండ్రి చనిపోయారు.
అవామీలీగ్ మద్దతుదారులను లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు పాల్పడుతున్నాయి. ఓ యువ నటుడు, దర్శకుడైన అతడి తండ్రిని నిరసనకారులు అతికిరాతకంగా హత్యచేశారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్‌లో నటించాడు. ‘తుంగిపరార్ మియా భాయ్’ సినిమాలో నిర్మాత సలీమ్ కుమారుడు, నటుడు శాంతో ఖాన్ రెహమాన్ యుక్తవయసు పాత్రను పోషించాడు.
వీరిద్దరూ చాంద్‌పూర్ అనే ప్రాంతం నుంచి పారిపోతుండగా. బలియా యూనియన్‌లోని ఫరక్కాబాద్ మార్కెట్లో పలువురు చుట్టుముట్టారు. అక్కడి నుంచి తండ్రీ కొడుకు తప్పించుకున్నారు. కానీ దగ్గర్లోని బగారా మార్కెట్‌కి వచ్చేసరికి మరోసారి పెద్దమొత్తంలో అల్లరిమూకలు చుట్టుముట్టి కొట్టి చంపేసినట్లు బంగ్లాదేశ్ కు చెందిన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. షాప్లా మీడియా అనే నిర్మాణ సంస్థని స్థాపించిన సలీం ఖాన్ పలువురు అగ్రనటులతో సినిమాలు తీశారు.