భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఇద్దరు వ్యోమగాములను ఎన్ఎంఏ ఎంపిక చేసింది. ముందుగా శుభాంశు శుక్లాకు ఆ అవకాశం దక్కింది. ఏదైనా అనుకోని అనారోగ్య కారణాలతో ఇబ్బందులు తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్‌కు కూడా ఇస్రో ఎంపిక చేసింది. నాసా గుర్తింపు పొందిన యాక్సియమ్ సంస్థ సూచనల మేరకు వీరిద్దరి పేర్లు ప్రకటించారు. నేషనల్ మిషన్ ఎసైన్మెంట్ బోర్డు
వీరిద్దరినీ ఎంపిక చేసినట్లు ఇస్రో తెలిపింది. వీరితోపాటు అజిత్ కృష్ణన్,అంగద్ ప్రతాప్‌లకు కూడా శిక్షణ అందించనున్నారు.
భారత్ త్వరలో చేపట్టబోయే అంతరిక్ష యాత్ర సమయానికి వీరు శిక్షణ ముగించుకుని అన్ని విధాలా సిద్దం కానున్నారు. అంతరిక్షంలో సాంకేతిక ప్రయోగాలు శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు.భారత్ ఇప్పటి వరకు అనేక మానవరహిత ప్రయోగాలు చేసి విజయవంతమైంది, త్వరలో చేపట్టబోయే మానవరహిత అంతరిక్షయాత్ర విజయవంతమైతే భారత్ అగ్రరాజ్యాల సరసర చేరనుంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు