ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా తొలిసారి ఒక మహిళా అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ గా సేవలందించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా సాధనా సక్సేనా నాయరే కావడం మరో విశేషం. ర్యాంకులో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ కీలక పదవిలో నియమించారు. ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా సాధనా పనిచేశారు.
పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ చదివిన సాధనా సక్సేనా నాయర్, 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఇప్పుడు ఏకంగా ఆర్మీ మెడికల్ సర్వీసెస్‌కు డీజీ అయ్యి రికార్డు సృష్టించారు. ఆర్మీలో పనిచేస్తూనే ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు.