పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మరో పతకం సాధించారు. 10మీటర్లు మిక్స్డ్ పిస్టల్ షూటింగ్ విభాగంలో సరబ్జోత్ సింగ్,మనూ భాకర్ కాంస్య పతకం సాధించారు. దక్షిణకొరియా ఆటగాళ్లు లీ యుజియా జంట 10 పాయింట్లు సాధించగా, సరబ్జోత్ సింగ్, మను భాకర్ 16 పాయింట్లు సాధించి కాంస్య పతకం గెలుచుకున్నారు.
మనూ భాకర్ ఇప్పటికే 10 మీటర్ల పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. తాజాగా మిక్స్డ్ విభాగంలో కూడా పతకం గెలవడంతో స్వాతంత్యం వచ్చాక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి అథ్లెట్‌గా నిలిచింది. 1900 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో బ్రిటిష్ ఇండియన్ ఆటగాడు నార్మన్ ప్రిచర్డ్ రెండు రజతాలు సాధించాడు.