రాజమహేంద్రవరంలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. ఏటీఎంలలో డబ్బు నింపే ఏజన్సీ హెచ్‌టీసీలో పని చేసే అశోక్ అనే ఉద్యోగి రూ. 2.20కోట్లు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు గంటలోనే దొంగను పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.
రాజమహేంద్రవరంలోని మాచరమెట్ట ప్రాంతానికి చెందిన అశోక్ ఏటీఎంలలో డబ్బు నింపే ఏజన్సీ హెచ్‌టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ ఉదయం సంస్థ నుంచి రూ.2.20కోట్ల విలువైన చెక్కు తీసుకుని హెచ్‌డీఎఫ్‌సీలో నగదుగా మార్చాడు. దాదాపు పది ఏటీంఎంలు నింపాల్సి ఉంది. ఆ డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసి, సిద్దంగా ఉంచుకున్నకారులో అశోక్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. వెంటనే ఏజన్సీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ అశోక్‌ను అదుపులోకి తీసుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాడుపడ్డ అశోక్ చోరీకి ముందు నుంచే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.