ప్రపంచ క్రీడా సంబరాలు ఒలింపిక్స్‌లో ఈసారి భారతదేశం 117మంది క్రీడాకారులతో తలపడుతోంది. ఒలింపిక్స్‌లో మొదటి రోజయిన ఇవాళ శనివారం, మన ఆటగాళ్ళు ఏడు ఈవెంట్స్‌లో పాల్గొంటారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఏయే క్రీడాకారులు ఏయే పోటీల్లో బరిలోకి దిగుతారో చూద్దాం.
మధ్యాహ్నం 12.30కి రోయింగ్‌లో సింగిల్ స్కల్స్ హీట్స్ ఈవెంట్‌లో బల్‌రాజ్ పన్వర్ పోటీ పడతాడు.
మధ్యాహ్నం 12.30కి పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సెడ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత జట్లు పోటీ పడతాయి. సందీప్ సింగ్-ఇలవేనిల్ వలరివన్ ఒక జట్టుగానూ, అర్జున్ బబూతా, రమితా జిందాల్ మరో జట్టుగానూ పాల్గొంటారు.
మధ్యాహ్నం 2గంటలకు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫయర్స్, మధ్యాహ్నం 4 గంటలకు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫయర్స్ ఈవెంట్స్ జరుగుతాయి. వాటిలో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ చీమా, మను భాకెర్, రితమ్ సంగ్వాన్ పాల్గొంటారు.
మధ్యాహ్నం 3.30కి పురుషుల డబుల్స్ టెన్నిస్ మొదటి రౌండ్‌లో భారత్ తరఫున రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ జంట పాల్గొంటుంది.
ఈ రాత్రి 7.10కి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ గ్వాటెమాలా ఆటగాడిని ఎదుర్కొంటాడు.
రాత్రి 8 గంటలకు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ మ్యాచ్‌లో రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుతో తలపడుతుంది.
రాత్రి 11.50కి బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ గ్రూప్ మ్యాచ్‌లో అశ్వినీ పొన్నప్ప, తనీషా క్రాస్టో జంట కొరియా జట్టుతో తలపడుతుంది.
ఈ రాత్రి 7.15కు టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్‌లో హర్మీత్ దేశాయ్ పోటీ పడతాడు.
రాత్రి 9గంటలకు హాకీలో పూల్ బి మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు న్యూజీలాండ్‌తో తలపడుతుంది.
ఈ అర్ధరాత్రి 12.02గంటలకు బాక్సింగ్ మహిళల 54కేజీల విభాగంలో జరిగే ఓపెనింగ్ బౌట్‌లో ప్రీతీ పవార్ వియత్నాం క్రీడాకారిణితో పోటీ పడుతుంది.