ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలి సెమీస్లో బంగ్లాదేశ్ ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. వికెట్ కోల్పోకుండా షఫాలి వర్మ(26), స్మృతి మంధాన(55)జట్టును గెలిపించారు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్, 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెప్టెన్ సారథి నిగర్ సుల్తానా ఒక్కరే పోరాడి 32 పరుగులు చేయగా షోర్నా 19 పరుగులతో రాణించింది. మిగతావారు సింగిల్ డిజిట్ దాటకుండానే పెవిలియన్ చేరారు.
భారత బౌలర్లలో రేణుకా, రాధా యాదవ్ చెరో మూడు వికెట్లు తీయగా పూజా వస్త్రాకర్, దీప్తిశర్మ తలో వికెట్ పడగొట్టారు.
రెండో సెమీస్ లో భాగంగా (శ్రీలంక vs పాకిస్తాన్) విజేతతో ఈనెల 28న భారత్ ఫైనల్ ఆడనుంది. పాకిస్తాన్ ను లీగ్ దశలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది.