సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(కాంగ్రెస్) సింగరేణిని కాపాడాలని, ప్రైవేటీకరించవద్దని లోక్ సభలో కోరారు. ఈ అంశంపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందన్నారు. సింగరేణిని ప్రయివేటీకరించే ఉద్దేశం తమకు లేదని వివరించారు.
సింగరేణికి పదేళ్ళ నుంచి ఎలాంటి మైనింగ్ ఇవ్వలేదని, కానీ ఒడిశాలో తమ పార్టీ బీజేపీ అధికారంలోకి రాగానే మైనింగ్ కోసం అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.