ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆ తరవాత స్పీకర్ అయ్యన్న పాత్రుడి నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. బుధవారంనాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఆ తరవాత సీఎం చంద్రబాబునాయుడు మూడు శాఖల శ్వేత పత్రాలను సభలో వివరించనున్నారు. శాంతి భద్రతలు, పరిశ్రమలు, ఆర్థిక శాఖ చేసిన అప్పులపై మూడు శ్వేత పత్రాలు అసెంబ్లీ వేదికగా విడుదల చేస్తారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యారు. బుధవారం ఢిల్లీలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న దీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకపోవడంతో ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.