డెమోక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి తప్పుకున్నారు. బైడెన్ రేసు నుంచి తప్పుకోవడంపై ఆ పార్టీ నాయకురాలు కమలా హారిస్ ధన్యవాదాలు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌ను ఓడించడమే లక్ష్యంగా అందరూ పనిచేస్తున్నామని కమలా హారిస్ చెప్పారు.
అమెరికాలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడం, ట్రంప్‌తో జరిగిన చర్చలో వైఫల్యం చెందడంతో వైదొలగాల్సి వచ్చింది. అమెరికా ప్రజల ప్రయోజనాల దృష్ణా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ తెలిపారు.
దక్షిణాఫ్రికా మూలాలున్న అమెరికన్ కమలా హారిస్ ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. జో బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్‌కు దాదాపు మార్గం సుగమం అయిందని చెప్పవచ్చు. అయితే త్వరలో షికాగోలో జరగనున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థి ఎవరనేదానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.