హూతీ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం యెమెన్‌పై భీకరదాడులకు దిగింది. అల్ హోదైదా పోర్టు సహా, యెమెన్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. నౌకాశ్రయంలో నిల్వ ఉంచిన ఆయిల్ నౌకలు తగలబడ్డాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. శుక్రవారం ఇజ్రాయెల్‌పై హూతీలు డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు భావిస్తున్నారు.
అల్ హూదైదాలో హూతీలకు మంచి పట్టుంది. నౌకాశ్రయం అడ్డాగా ఉగ్రవాదులు తెగబడుతున్నారు. అక్కడే విద్యుత్ కేంద్రం కూడా ఉంది. పాలస్తీనా ఉగ్రవాదులకు హూతీలు మద్దతు పలుకుతున్నారనే కారణంతోనే తమపై ఇజ్రాయెల్ దాడులు చేసిందని హూతీల అధిపతి అబ్దుల్ సలాం చెప్పారు. ఈ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.